G-L53TNVHN5Y ఇంటర్ పరీక్షలో 8 మంది విద్యార్థుల డిబార్ | Praja Shankaravam

ఇంటర్ పరీక్షలో 8 మంది విద్యార్థుల డిబార్

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 13 (ప్రజా శంఖారావం):

జగిత్యాల కేంద్రంలోని వివిధ పరీక్ష కేంద్రాలలో మాలప్రాక్టీస్ కు పాల్పడ్డ 8మంది ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులను డిబార్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సర జనరల్ విద్యార్థులకు జరిగిన, రసాయన శాస్త్రము, వాణిజ్య శాస్త్రం పరీక్షలో 6144 మంది విద్యార్థులకు 5966 మంది హాజరవ్వగా, 178 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 664 విద్యార్థులకు గాను 576 మంది విద్యార్థులు హాజరవ్వగా, 88 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం మీద 96.09 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఇంటర్ బోర్డ్ స్పెషల్ అబ్జర్వర్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ లు, సిట్టింగ్ స్క్వాడ్ లు, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ, పరీక్షల కన్వీనర్ కలిసి మొత్తం 21 పరీక్ష కేంద్రాలలో తనిఖీలు చేశారు. స్టేట్ అబ్జర్వర్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కొడిమ్యాల లో ఒకరిని, ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్యాల కేంద్రంలో ఐదుగురిని, శ్రీ వైష్ణవి ఒకేషనల్ జూనియర్ కళాశాల జగిత్యాల పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థులపై మాల్ ప్రాక్టిస్ కేసులు బుక్ చేశారు. ఇంటర్మీడియట్ మిగిలిన పరీక్షలలో విద్యార్థులు తమ వెంట ఎలాంటి మెటీరియల్ ను తీసుకురాకూడదని, సబ్జెక్టు కు సంబందించిన ఏదేని మెటీరియల్ ఉంటే మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ అయ్యే అవకాశముందని పరీక్షల కన్వీనర్ బి నారాయణ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 8:45 నిమిషముల కంటే ముందుగానే చేరుకుని వారికి కేటాయించిన సీట్లో కూర్చోవాలని తెలియజేశారు. మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు టెలి మానస్ 14416 నెంబర్ కు ఫోన్ చేసి వైద్య సహకారాన్ని పొందవలసిందిగా పరీక్షల కన్వీనర్ ప్రకటనలో కోరారు.

Leave A Reply

Your email address will not be published.