G-L53TNVHN5Y మద్యం లోడ్ తో వెళుతున్న వాహనం బోల్తా | Praja Shankaravam

మద్యం లోడ్ తో వెళుతున్న వాహనం బోల్తా

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 13 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా కరీంనగర్‌ ప్రధాన రహదారి మల్యాల మండలం వీఆర్‌కే ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద వాహనాన్ని తప్పంచ బోయి లిక్కర్ వాహనం బోల్తా పడింది. వైన్స్ దుకాణాల కోసం తీసుకెళ్తున్న బీర్లు, విస్కీ సీసాల లోడ్ తో వెళుతున్న వాహనం బోల్తా పడడంతో సుమారు50 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం బాటిళ్లు పగిలిపోవడంతో రహదారిపై మద్యం ఏరులై పారింది. వ్యాన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. సకాలంలో మల్యాల పోలీసులు చేరుకుని మద్యం బాటిళ్లకు భద్రతగా కల్పించారు.

Leave A Reply

Your email address will not be published.