G-L53TNVHN5Y ఎఫెక్ట్… ప్రజా శంఖారావం తెలుగు దిన పత్రిక వార్తకు స్పందన అక్రమ ఫ్రీ కాస్ట్ ను తొలగించిన అధికారులు | Praja Shankaravam

ఎఫెక్ట్… ప్రజా శంఖారావం తెలుగు దిన పత్రిక వార్తకు స్పందన అక్రమ ఫ్రీ కాస్ట్ ను తొలగించిన అధికారులు

ఆర్మూర్ టౌన్, మార్చి 14 (ప్రజా శంఖారావం):

జాతీయ రహదారి 43 ఆనుకుని జాతీయ రహదారి కి చెందిన భూమిని తమభూమిగా చూపుతూ పట్టణ కేంద్రానికి చెందిన ఒక ప్రముఖ బంగారం వ్యాపారి వేసిన అక్రమ ఫ్రీ కాస్ట్ ను ఎట్టకేలకు అధికారులు తొలగించారు. వరుసగా “ప్రజా శంఖారావం” తెలుగు దినపత్రికలో వచ్చిన వరుస వార్త కథనాలకు స్పందించిన ఎన్ హెచ్ ఎ ఐ, రెవెన్యూ అధికారులు అక్రమంగా నిర్మించిన ఫ్రీకాస్ట్ ను తొలగిస్తూ, జాతీయ రహదారికి సంబంధించిన భూమి పరిధిలో హద్దురాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సంఘటన స్థలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు మధ్య అక్రమ ప్రికాస్ట్ తొలగించినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారి భూమి అక్రమంగా ఆక్రమించుకుని ప్రికాస్టు ఏర్పాటు చేసిన సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాతీయ రహదారి పర్సనల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి సైట్ ఇంజనీర్ రవిశంకర్ కుమార్, జాతీయ రహదారి రూట్ ఆపరేషన్ మేనేజర్ లు వీరాజ్ దేశ్ పాండే, వీర బాబు, రహదారి కన్సల్టెంట్ రామారావు, రెవెన్యూ సర్వేయర్ షికారి రాజు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ అశోక్, జాతీయ రహదారి సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.