G-L53TNVHN5Y మాజీ ఎమ్మెల్యే మృతి | Praja Shankaravam

మాజీ ఎమ్మెల్యే మృతి

వరంగల్ జిల్లా (జగిత్యాల జిల్లా ప్రతినిధి), మార్చి 14 (ప్రజా శంఖారావం):

వరంగల్ జిల్లా పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు అనారోగ్యంతో మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. ఆయన ప్రముఖ వైద్యులు, అంతర్జాతీయ స్థాయి ఎండోక్రైనాలజిస్ట్ గా కూడా ప్రజలకు సేవలు అందించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. సుధాకర్ రావు నిన్న రాత్రి తుది శ్వాస విడిచారని తెలియడంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సంతాపం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.