G-L53TNVHN5Y దొంగల బీభత్సం… 3 ఇళ్లలో భారీ చోరీ.. | Praja Shankaravam

దొంగల బీభత్సం… 3 ఇళ్లలో భారీ చోరీ..

ఆర్మూర్, మార్చ్ 16 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ 21, 22 వార్డులలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 21 వ వార్డులో క్లాసిక్ ఫంక్షన్ హాల్ మేనేజర్ నాయిముద్దిన్ ఇంట్లో గోడ దూకి చొరబడి దాదాపు 2 లక్షల రూపాయలు, 10 తులాల బంగారం అపహరించారని కొన్ని విలువైన బట్టలు కూడా ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు. 22 వ వార్డులో షబానా బేగం ఇంట్లో 80వేలు, 1తులం బంగారం చోరీ చేసినట్టు బాధితులు తెలిపారు. 22 వ వార్డులోనే చిలక గంగుబాయి ఇంటి తాళం పగల గొట్టి చోరికి ప్రయత్నం చేయగా పక్కింటి వారు అలికిడి శబ్ధం వచ్చి అరుపులు వేయగా కొన్ని వస్తువులు దొంగిలించి పరారయ్యారని బాధితులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.