G-L53TNVHN5Y మహిళలను ఢీ కొట్టిన కారు | Praja Shankaravam

మహిళలను ఢీ కొట్టిన కారు

* ఒకరికి గాయాలు
* ఇద్దరి మహిళల పరిస్థితి విషమం..
* స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలింపు

మెట్ పల్లి, మార్చి 16 (ప్రజా శంఖారావం):

మెట్ పల్లి పట్టణ శివారులోని ఆరపేట శివారులోని శివాలయం వద్ద ముగ్గురు మహిళలు రోడ్ దాటుతుండగా గుర్తుతెలియని వాహనం మహిళలను ఢీ కొట్టి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మహిళలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇందులో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండడంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.