G-L53TNVHN5Y మాజీ ఎంపీ హోటల్లో పోలీసుల తనిఖీలు కలకలం… | Praja Shankaravam

మాజీ ఎంపీ హోటల్లో పోలీసుల తనిఖీలు కలకలం…

* 6.65 కోట్లు స్వాధీనం..?
* ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో దాడులు కలకలం…
* బిఆర్ఎస్ మాజీ ఎంపీ కార్యకలాపాల నేపథ్యంలో దాడుల?
* అర్ధరాత్రి నుండి కొనసాగుతున్న తనిఖీలు..!

కరీంనగర్ జిల్లా, మార్చి 16 (ప్రజా శంఖారావం):

కరీంనగర్ పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రతిమ హోటల్ లో పోలీసులు తెల్లవారుజామున దాడులు ప్రారంభించారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు అణువు అణువు సోదాలు చేస్తున్నాయి. అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పోలీసులు ప్రతిమ హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చి తనీఖీలు చేపట్టారు. ఈ దాడులు శనివారం ఉదయం వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కరీంనగర్ పోలీసులకు అందిన కీలక సమాచారం మేరకే ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు ప్రతిమలో రూ. 6కోట్ల 65లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది. ప్రతిమ హోటల్స్ కు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కు సంబంధాలు ఉన్నాయి. పార్టీ కార్యకలాపాలు, రాజకీయ సమీకరణాలు ఇక్కడి నుండే మంత్రాంగం జరిపేందుకు వినోద్ కుమార్ ప్రాధాన్యత ఇస్తుంటారు. మరి కొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులకు కీలక సమాచారం అందడంతో ఈ దాడులు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడినుండి కార్యకలాపాలు సాగించడంతో దాడులు చేస్తున్నారా అన్న చర్చ జరుగుతుంది. కానీ ఈ దాడులు, తనిఖీలు ఎందుకు చేస్తున్నారన్న స్పష్టత ఇంకా రాలేదు.

Leave A Reply

Your email address will not be published.