G-L53TNVHN5Y మానసిక స్థిమితం లేక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య | Praja Shankaravam

మానసిక స్థిమితం లేక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య

ఆర్మూర్ టౌన్, మార్చి 17 (ప్రజా శంఖారావం):

మానసిక పరిస్థితి లేక ఒక వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. చేపూర్ గ్రామానికి చెందిన బండి గంగాధర్ (64) కుటుంబ సభ్యులతో సఖ్యతలేక మానసిక మనోవేదనతో ఆదివారం మధ్యాహ్నం విద్యా నగర్ కాలనీలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సిఐ రవికుమార్ తెలిపారు. మృతుడు గత రెండు నెలల క్రితం హత్య చేసిన ఘటనలో నిందితునిగా జైలు శిక్ష అనుభవించినట్లు చెప్పారు. మృతుడు డయాలసిస్ రోగి కావడంతో బెయిల్ పై బయటకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని, స్థానికంగా తెలిసిన సమాచారమే చెబుతున్నట్లు సిఐ వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.