G-L53TNVHN5Y కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు | Praja Shankaravam

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు

ఆర్మూర్ టౌన్, మార్చి 19 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ పట్టణ కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటూన్నారు. తాజాగా ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ లతో పాటు ప్రస్తుత కౌన్సిలర్లు కొందరు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర కో అపరేటివ్ సంస్థ చైర్మన్, నిజామాబాద్ డిసిసి మానాల మోహన్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం హైదరాబాద్ లోని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో తాజా మాజీ ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్, మాజీ చైర్మన్ సంజయ్ సింగ్ స్వాతి బబ్లు, ప్రస్తుత మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బాదం రాజ్ కుమార్, తాటి హనుమాన్లు, ఎస్సార్ సుజాత రమేష్, మాజీ కౌన్సిలర్లు జో శ్రీనివాస్, బోండ్ల సంతోష్, మాజీ సర్పంచ్లు కొంగి సదాశివ్, సాయినాథ్ గౌడ్, ఆర్మూర్ బిఆర్ఎస్ నాయకులు కొట్టాల మోహన్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి మాజీ సర్పంచ్ జ్యోతి మారుతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజు భాయ్, చిట్టి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.