G-L53TNVHN5Y నెమలిని వేటాడిన కేసులో డిఎస్పి తండ్రి అరెస్ట్ | Praja Shankaravam

నెమలిని వేటాడిన కేసులో డిఎస్పి తండ్రి అరెస్ట్

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 19 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి అడవి జంతువులను వేటాడుతున్నట్లుగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ లకు వచ్చిన సమాచారంతో వాహనాలను తనిఖీ చేశారు. ములుగు జిల్లాకు చెందిన డిఎస్పీ తండ్రి సత్యనారాయణ జాతీయ పక్షి నెమలిని వేటాడి చంపి తన కారులో తీసుకెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా కారులో లైసెన్స్ తుపాకీ, మృతి చెందిన జాతీయ పక్షి నెమలి కళేబరం లభించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని, మృతి చెందిన నెమలి కళేబరాన్ని పోలీస్ స్టేషన్ తరలించి డీఎస్పి తండ్రి సత్యనారాయణ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు పోలీసులు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.