G-L53TNVHN5Y బుక్కెడు బుక్క, ముక్క కోసం ఇరువర్గాల ఘర్షణ | Praja Shankaravam

బుక్కెడు బుక్క, ముక్క కోసం ఇరువర్గాల ఘర్షణ

మెట్ పల్లి, మార్చి 20 (ప్రజా శంఖారావం):

అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లిలో బుక్కెడు బుక్క, ముక్క కోసం తోపులాట ఇరువర్గాల ఘర్షణతో అప్పటి వరకు పెళ్లి వాయిద్యాలతో బాజా భజంత్రీలతో అట్టహాసంగా నవ్వుతూ పెళ్లి వేడుకకు వచ్చిన చుట్టాలతో సందడిగా ఉన్న పెళ్లి వాతావరణం ఒక్కసారిగా ఇరు వర్గాల ఘర్షణతో మెట్ పల్లి మండలం ఆత్మకూరులో హీటెక్కింది. వివరాల్లోకి వెళితే బుధవారం ఆత్మకూరు గ్రామంలో జరిగిన పెళ్లికి వారి బంధువులు వేములవాడ నుంచి హాజరు కాగా భోజన సమయంలో ఇరు వర్గాల వారు భోజన సమయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అమ్మాయి తరఫున బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అబ్బాయి తరఫున బంధువులపై ఏడుగురుపై అలాగే అబ్బాయి తరఫున బంధువులు వేములవాడకు చెందిన ఫిర్యాదు మేరకు ఆత్మకూరు కు చెందిన అమ్మాయి తరఫున బంధువులపై 9 మంది కేసు నమోదు చేసినట్లు మెట్ పల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. పెళ్లి వేడుకకు వచ్చిన వేడుకలో ఇరు వర్గాల ఘర్షణతో యుద్ధ వాతావరణమే సృష్టించారు.

Leave A Reply

Your email address will not be published.