G-L53TNVHN5Y ఏకగ్రీవంగా నూతన మున్సిపల్ చైర్ పర్సన్ గా వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్ ఎన్నిక | Praja Shankaravam

ఏకగ్రీవంగా నూతన మున్సిపల్ చైర్ పర్సన్ గా వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్ ఎన్నిక

* నూతన చైర్పర్సన్ ఎంపికకు హాజరైన 30 మంది కౌన్సిలర్లు

* 5 మంది బిజెపి కౌన్సిలర్లు, మాజీ చైర్ పర్సన్ గైర్హాజరు

 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మార్చి 21 (ప్రజా శంఖారావం):

ఉత్కంఠ భరితంగా సాగిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్పర్సన్ ఎన్నిక ముగిసింది. మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా, 30 మంది కౌన్సిలర్లు నూతన చైర్పర్సన్ ఎన్నికలకు హాజరయ్యారు. మిగతా ఐదు మంది బిజెపి కౌన్సిలర్లతో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ నూతన చైర్పర్సన్ ఎంపిక సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ మేరకు మెజారిటీ 30 మంది సభ్యులు హాజరవడంతో నూతన చైర్ పర్సన్ ఎన్నిక సమావేశాన్ని ఆర్డిఓ రాజా గౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో మెజారిటీ సభ్యులు ఏకగ్రీవంగా 23 వార్డ్ కౌన్సిలర్ వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాసును నూతన చైర్పర్సన్ గా ఎంపిక చేశారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి తన పంతం నెగ్గించుకుని ఆర్మూర్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు.

Leave A Reply

Your email address will not be published.