G-L53TNVHN5Y 10కిలోల గంజాయి, 5గురు అరెస్ట్ | Praja Shankaravam

10కిలోల గంజాయి, 5గురు అరెస్ట్

*5 సెల్ ఫోన్లు, 2 బైక్ లు స్వాధీనం

* వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 23 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా రాయికల్, మల్లాపూర్ మండలాల్లో వేరువేరు ఘటనల్లో 10 కిలోల గంజాయితోపాటు ఐదుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు. తమ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించే సమయంలో 25 సంవత్సరాల లోపు యువకులు గంజాయి రవాణా చేస్తుండగా పట్టుబడ్డట్లు ఆయన వివరించారు. గణేష్, సతీష్, సాగర్, అజయ్, నితిన్ లను అదుపులోకి తీసుకొని వారి వద్ద 10 కిలోల గంజాయి తో పాటు 5 సెల్ ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. వైజాగ్ నుండి గంజాయి స్మగ్లర్లతో కాంటాక్ట్ లు పెట్టుకొని జగిత్యాల జిల్లాలో గంజాయి సరఫరా చేయడానికి వీరు ఒప్పందం కుదుర్చుకొని, గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లు తమ విచారణలో తేలిందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇలాంటి స్మగ్లింగ్లకు పాల్పడవద్దని సూచించారు. ఇంకా పూర్తి వివరాలు తమ విచారణలో తెలియాల్సి ఉందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.