G-L53TNVHN5Y విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఎస్సై సస్పెండ్ | Praja Shankaravam

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఎస్సై సస్పెండ్

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 24 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా డిసిఆర్బిలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, తోటి మహిళా కానిస్టేబుల్ తో అసభ్యకరంగా ప్రవర్తించాడని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలో భాగంగా సదరు ఎస్సైని మల్టీజ్ 1 ఐజి సస్పెండ్ చేసినట్లు సమాచారం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సదరు ఎస్సై కి ఇదే మీ కొత్త కాదని, గతంలో కూడా ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సస్పెండ్ కు గురైన సదరు ఎస్సై గతంలో పనిచేస్తున్న ఓ పోలీస్ స్టేషన్లో తోటి మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో సదరు మహిళ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు స్టేషన్కు వచ్చి నానా హంగామా చేశారు ఆ సమయంలో స్టేషన్లో ఎస్ఐ లేకపోవడంతో తోటి సిబ్బంది కుటుంబ సభ్యులను సముదాయించి అక్కడి నుండి పంపించేశారు కానీ సదర్ మహిళా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన అధికారులు అదే కారణం పై ఎస్సైని సస్పెండ్ చేసినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.