G-L53TNVHN5Y ఖాకీ పాడుపని.. యువతితో పరిచయం..? | Praja Shankaravam

ఖాకీ పాడుపని.. యువతితో పరిచయం..?

* విచారణ పేరుతో ట్రాప్..

* సదరు అధికారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

* చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్..

ఇబ్రహీం పట్నం, మార్చి 25 (ప్రజా శంఖారావం):

న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే ఆ యువతి పట్ల సదరు అధికారి వంకర బుద్దిని చూపించాడు. విచారణ పేరుతో యువతని ట్రాప్లోకి దించిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. ఏదైనా ఆపద వస్తే ముందుగా గుర్తొచ్చేది పోలీస్ స్టేషన్ ఆ తర్వాతనే దేవుని దేవాలయాల చుట్టూ తిరుగుతారు. దేవాలయాల కంటే పవిత్రమైన పోలీస్ స్టేషన్ లోనే ఖాకి ముసుగు వేసుకున్న కామాంధుడు ఓ 22 సంవత్సరాల యువతని విచారణ పేరుతో ట్రాప్ లోకి దించాడు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి కొద్ది రోజుల క్రితం ఓ కేసు విషయమై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఓ ఏఎస్ఐ ఆ యువతిపై కన్నేశాడు. విచారణ పేరుతో యువతికి తరచూ ఫోన్లో మాట్లాడి లొంగపరచుకునేందుకు ప్రయత్నం చేశాడు. వారిద్దరు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో సదరు ఏఎస్ఐ బాగోతం బయటపడింది. కూతురు వయసు ఉన్న అమ్మాయితో సరసం ఏంటని పలువురు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి వంకర బుద్ధి అధికారులపై ఉన్నత అధికారులు వెంటనే క్రమ శిక్షణ చర్యలు తీసుకొవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.