G-L53TNVHN5Y ఖాకీ పాడుపని పై ఏఎస్ఐ సస్పెండ్ | Praja Shankaravam

ఖాకీ పాడుపని పై ఏఎస్ఐ సస్పెండ్

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 26 (ప్రజా శంఖారావం):

మహిళా ఫిర్యాదురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఎవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా తన భర్త గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం సస్పెండ్ కు గురైయిన ఏఎస్ఐ కూడా ఇదే పోలీసు స్టేషన్విధులు నిర్వహిస్తుండంతో సదరు బాధిత మహిళాతో పరిచయం చేసుకొని, బాధితురాలికి తగు న్యాయం చేస్తానని బాధిత మహిళను నమ్మించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. సదరు మహిళ ఫోన్ నంబర్ తీసుకోని ముచ్చటించడంతో పాటు ఆమెతో ఏఎస్ఐ రామయ్య అక్రమ సంబంధం కొనసాగించడంతో తాను బందోబస్తూ విధులు నిర్వహించే ప్రదేశానికి సదరు మహిళను పిలిపించుకొని బందోబస్తు నిర్వహించే పరిసర ప్రాంతాల్లో మహిళతో ఏకాంతంగా గడిపేవాడని సమాచారం. అయితే ఈ ఏఎస్ఐ రాసలీల బాగోతానికి సంబంధించిన ఫోటోలు సామజిక మధ్యామాల్లో చక్కర్లు కొట్టడంతో సదరు ఏఎస్ఐ నిర్వాహకంపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఇదే కారణంతో సదరు ఏఎస్ఐని మల్టీ జోన్ 1 ఐజి ఎవి రంగనాథ్ సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.