G-L53TNVHN5Y తేనెటీగల దాడిలో బర్ల కాపరి మృతి | Praja Shankaravam

తేనెటీగల దాడిలో బర్ల కాపరి మృతి

మల్లాపూర్, మార్చి 27 (ప్రజా శంఖారావం):

మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామ శివారులో బర్లు కాయడానికి వెళ్ళిన పుట్ట ధర్మయ్య (35) తేనెటీగలు దాడిలో మృతి చెందాడు. గ్రామ శివారులోని బర్రెలు మేపుతున్న సమయంలో ఒక్కసారిగా అతని పై తేనెటీగలు దాడి చేయడంతో పరుగులు తీసి అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై కిరణ్ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.