G-L53TNVHN5Y ఇద్దరు కానిస్టేబుల్ ల సస్పెండ్ | Praja Shankaravam

ఇద్దరు కానిస్టేబుల్ ల సస్పెండ్

మల్లాపూర్, మార్చి 28 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్ లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 17న మల్లాపూర్ ఎస్సై బందోబస్తుకు వెళ్లగా పోలీస్ స్టేషన్ డాబాపై ఒక హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ లు రాజకీయ నాయకులతో కలిసి మద్యం సేవించిన ఘటనలో స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్ లపై సమగ్ర విచారణ జరిపి ఇద్దరి కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ పై విచారణ జరుపుతున్నమని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.