G-L53TNVHN5Y సాగు నీటికోసం రోడ్డెక్కిన రైతులు | Praja Shankaravam

సాగు నీటికోసం రోడ్డెక్కిన రైతులు

 

* ఎమ్మెల్యే నచ్చచెప్పిన వినని రైతులు
* కెనాల్ పై బయటాయించి రైతుల నిరసన
* నీటి విడుదలపై హామీ ఇవ్వాలని రైతుల డిమాండ్

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 30 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రం శివారులోని వరద కాలువ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గత కొద్దిరోజులుగా వరద కాలువ నీళ్లు రాకపోవడంతో వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే వరద కాలువ నీరు విడుదల చేయాలని రైతులు నినాదాలు నిరసన తెలిపారు. కథలాపూర్ మండలంలోని చాలా గ్రామాల చుట్టూ వరద కాలువ ఉండటం వల్ల వరద కాలువ నీటితో వ్యవసాయం చేసుకుంటున్నామని, ఇప్పుడు నీరు లేకపోవడం వల్ల వరి, మొక్కజొన్న, చెరుకు ఇతర పంటలు కూడా ఎండిపోతున్నాయని రైతులకు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్న క్రమంలో కథలాపూర్ మండల పర్యటనకు వచ్చిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రైతులకు నచ్చజెప్పె ప్రయత్నం చేసినప్పటికీ రైతులు వినలేదు, నీటి విడుదల చేస్తేనే ఇక నుండి కదులుతామని, తమకు నీటి విడుదల పై స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో గంటపాటు రైతులకు నచ్చ చెప్పిన కుదరకపోవడంతో ఎమ్మెల్యే అక్కడి నుండి వెళ్లిపోయారు. వరద కాలువ అనుకొని సుమారు 15 వేల ఎకరాల్లో వ్యవసాయ భూమి ఉందని, వివిధ పంటలు సాగుచేస్తూ వ్యవసాయం చేస్తున్నామని రైతులు వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వం చొరవచూపి వరద కాలువలో నీటిని విడుదల చేస్తే పంటలు పండుతాయని రైతులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.