G-L53TNVHN5Y గల్ఫ్ కేసులో కేరళకు చెందిన వ్యక్తి అరెస్ట్ | Praja Shankaravam

గల్ఫ్ కేసులో కేరళకు చెందిన వ్యక్తి అరెస్ట్

మెట్ పల్లి, ఏప్రిల్ 03 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ కేoద్రంలో గల్ఫ్ లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసలకు పాల్పడిన ఘటనలో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. మెట్ పల్లి సీఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం… పలు జిల్లాలోని కొందరికి వీసాలు ఇస్తానని మోసానికి పాల్పడిన కేరళ రాష్ట్రంలోని కోడికడ్ జిల్లాకు చెందిన మహ్మద్ హసిఫ్ ను అదుపులోకి తీసుకొని క్రైం నంబర్ 48, 51, 52, 67/2014 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి, జ్యుడిషియల్ రిమాండ్ తరించినట్లు సిఐ తెలిపారు. ఈ కేసు జనవరి నెలలో సుమారు 40 మంది గల్ఫ్ భాదితులను దుబాయికి పంపిస్తానని చెప్పి వారిలో ఒక్కొక్కరి వద్ద నుండి 26,500/- చొప్పున మొత్తం సుమారు 10 లక్షల పైన వసూలు చేసి, ఫేక్ వీజాలు ఇచ్చాడని బాధితుల ఫిర్యాదుల మేరకు మెట్పల్లి పట్టణానికి చెందిన అల్లా రమేష్ ను ఫిబ్రవరిలో రిమాండ్ చేయగా, అదే కేసులో A2 గా ఉన్న హసీఫ్ ను రిమాండ్ కు తరలించగా మరో ముగ్గురు పారారిలో ఉన్నట్లు సి ఐ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.