G-L53TNVHN5Y రేషన్ షాప్ లో పురుగులు పట్టిన బియ్యం పంపిణీ | Praja Shankaravam

రేషన్ షాప్ లో పురుగులు పట్టిన బియ్యం పంపిణీ

రాయికల్, ఏప్రిల్ 03 (ప్రజా శంఖారావం):

రాయికల్ పట్టణంలోని పలు రేషన్ షాపులలో పురుగులు పట్టిన బియ్యం పంపిణీ చేయడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం తీసుకోవడానికి వెళ్లగా బియ్యంలో తుక్కు, పెండ్లిలలో వాడే చెమికిలు, ముక్క, పురుగు పట్టిన బియ్యం పంపిణీ చేయడంపై ప్రజలు సదరు డీలర్ల పై మండిపడ్డారు. డీలర్ నుండి నిర్లక్ష్యపు సమాధానం రావడం, వండుకోవడానికి పూర్తిగా ఉపయోగపడని స్థితిలో బియ్యం ఉండడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. నాణ్యమైన బియ్యం పంపిణీ చేయమని కోరినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో బియ్యం తీసుకోవడంకు లబ్దిదారులు ఇష్టపడడం లేదు. ఈ బియ్యాన్ని వెనక్కి పంపి నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని సంబంధిత ఉన్నత అధికారులను ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.