G-L53TNVHN5Y 15 తులాల బంగారు నగలు చోరీ | Praja Shankaravam

15 తులాల బంగారు నగలు చోరీ

జగిత్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 05 (ప్రజా శంఖారావం):

జగిత్యాలపట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్ లో శుక్రవారం15తులాల బంగారు నగలు అపహరణకు గురైన సంఘటన చోటుచేసుకుంది. మెట్పల్లి కి చెందిన మంగరాణి తన కూతురి తో కలిసి బీర్పూర్ లో జరిగిన ఒక శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో బస్సు కోసం నిరీక్షిస్తుంది. ఈ క్రమంలో నగలు అపహరణకు గురైనట్లు గుర్తించిన బాధితురాలు వెంటనే జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న జగిత్యాల టౌన్ సిఐ వేణుగోపాల్, ఎస్ఐ నరేష్ లు సంఘటన స్థలానికి చేరుకుని బస్ స్టాండ్ లోని కంట్రోల్ రూమ్ లో ఉన్న సీసీ టివి ఫుటేజ్ లను పరిశీలించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు సిఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.