G-L53TNVHN5Y కోరుట్ల లో విషాదo… 16 నెలల బాబు మృతి | Praja Shankaravam

కోరుట్ల లో విషాదo… 16 నెలల బాబు మృతి

కోరుట్ల, ఏప్రిల్ 06 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నీటి సరఫరా చేసే ట్రాలీ ఆటో కింద పడి 16 నెలల బాబు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో ఆరు బయట ఆడుకుంటున్న 16నెలల బాలున్ని కిరాణాషాప్ లలో ఫిల్టర్ వాటర్ నీటి సరఫరా చేసే ట్రాలీ ఆటో వాటర్ ట్యాంక్ వెళుతున్న క్రమంలో బాబు ఆటో కింద పడి మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారిని కలిచివేశాయి.

Leave A Reply

Your email address will not be published.