G-L53TNVHN5Y విధుల్లో నిర్లక్ష్యంపై హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ | Praja Shankaravam

విధుల్లో నిర్లక్ష్యంపై హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

మల్లాపూర్, ఏప్రిల్ 08 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ పై సస్పెన్షన్ వేటు వేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు మల్టీ జోన్ ఐజి రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోనీ పోలీస్ స్టేషన్ లో మార్చ్ 17న మద్యం సేవించారని సిబ్బందిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. గతంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ లను సస్పెండ్ చేయగా మరి కొంతమంది ప్రమేయం ఉందని ఫిర్యాదుతో విచారణ చేసిన అనంతరం హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.