G-L53TNVHN5Y పేకాట ఆడుతున్న 9 మంది అరెస్ట్ | Praja Shankaravam

పేకాట ఆడుతున్న 9 మంది అరెస్ట్

ఆర్మూర్, ఏప్రిల్ 10 (ప్రజా శంఖారావం):

ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని లాలన ఆశ్రమం వద్ద పేకాట ఆడుతున్న స్థావరంపై నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ సిఐ అంజయ్య ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం దాడి చేశారు. ఎసిపి విష్ణుమూర్తి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సిఐ తెలిపారు. అనంతరం వారి వద్ద నుండి 13వేల రూపాయలు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసుకున్నట్లు సిఐ చెప్పారు. ఈ దాడిలో ఆర్మూర్ ఎస్సై అంజమ్మ, ఏఎస్ఐ లక్ష్మణ్, సిబ్బంది లక్ష్మణ్, సుదర్శన్, రాజేశ్వర్, రాములు, గజేందర్, అనిల్, నరసన్న, సుధాకర్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.