G-L53TNVHN5Y ఆటోలు ఢీకొని పలువురికి గాయాలు | Praja Shankaravam

ఆటోలు ఢీకొని పలువురికి గాయాలు

మెట్ పల్లి, ఏప్రిల్ 11 (ప్రజా శంఖారావం):

మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని అభయహస్త టెంపుల్ కమాన్ వద్ద పెప్సి కంపెనీకి చెందిన ఆటో ట్రాలీ, ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో అయిదుగురు వ్యక్తులు గాయపడ్డారు. పెప్సీ కంపెనీకి చెందిన ఆటోడ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో ఆటో ముందుకు వెళ్లి మెట్ పల్లి నుండి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను పెప్సి కంపెనీకి చెందిన ఆటో డీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.