G-L53TNVHN5Y రెండు బైకులు డీకొని ఇద్దరు మృతి | Praja Shankaravam

రెండు బైకులు డీకొని ఇద్దరు మృతి

మెట్ పల్లి, ఏప్రిల్ 12 (ప్రజా శంఖారావం):

మెట్ పల్లి పట్టణ శివారులోనీ పెద్ద గుండు వద్ద రెండు ఎదురు ఎదురుగా వస్తున్న బైకులు ఢీకొనీ ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. రెండు బైక్ లపైన వెళ్తున్న నలుగురు వ్యక్తులకు గాయలవగ ఇందులో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, గాయపడిన ఇద్దరిని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.