G-L53TNVHN5Y అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు | Praja Shankaravam

అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు

కోరుట్ల, ఏప్రిల్ 13 (ప్రజా శంఖారావం):

కోరుట్ల, మెట్ పల్లి పట్టణ కేంద్రాలలో అక్రమoగా అధిక వడ్డీలకు రుణాలు ఇస్తున్నారని పలువురు వడ్డీ వ్యాపారస్తుల ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలువురి వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పలు పత్రాలు, నగదు స్వాధీనపరచుకున్నట్లు సమాచారం. పోలీసుల సోదాలతో వడ్డీ వ్యాపారుల్లో భయం మొదలైంది. అమాయక జనాల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ సోదాలపై పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోదాల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.