G-L53TNVHN5Y వడ్డీ వ్యాపారస్తులపై దాడుల్లో బంగారం, నగదు సీజ్ | Praja Shankaravam

వడ్డీ వ్యాపారస్తులపై దాడుల్లో బంగారం, నగదు సీజ్

* కిలోన్నర బంగారం
* ఏడు లక్షల నగదు సీజ్
* వడ్డీ వ్యాపారస్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న పోలీసులు

మెట్ పల్లి, ఏప్రిల్ 14 (ప్రజా శంఖారావం):

అధిక వడ్డీలకు వ్యాపారాలు చేస్తూ పేదలపై పెత్తనం చెలాయిస్తున్న వడ్డీ వ్యాపారస్తుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. పోలీసుల దాడులతో అతలాకుతలమవుతున్న వడ్డీ వ్యాపారస్తులపై కొరడా గుల్పిస్తున్న పోలీసులు. జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవీంద్ర కుమార్ ఉత్తర్వులతో మెట్ పల్లి పట్టణంలో ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా పాన్ బ్రోకర్స్ పేరుతో ప్రజల వద్ద నుండి బంగారం తాకట్టు పెట్టుకొని అధిక వడ్డీలకు వ్యాపారం చేస్తున్నారని సమాచారంతో మెట్పల్లికి చెందిన కట్కం బ్రదర్స్ ఫైనాన్స్, వారి ఇళ్లపై పోలీసులు సోదాలు నిర్వహించారు. కిలోన్నర బంగారంతో పాటు 7 లక్షల నగదు,13 ప్రాంసరి రిసిప్ట్ బుక్ లను స్వాధీనపరుచుకున్నట్లు మెట్ పల్లి ఎస్సై చిరంజీవి తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహిస్తున్న కట్కం ప్రకాష్ ,రమేష్, శివ, కార్తీక్ లపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని మెట్పల్లి ఎస్సై చెప్పారు. శనివారం మధ్యాహ్నం మొదలైన సోదాలు ఆదివారం తెల్లవారుజామున వరకు కొనసాగాయి.

Leave A Reply

Your email address will not be published.