G-L53TNVHN5Y ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్.. | Praja Shankaravam

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్..

 

* ఆర్మూర్ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిక
* ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు బిఆర్ఎస్ మండల నాయకులు
* పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు
* బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా
* ఆయనతోపాటు పార్టీ మండల అధ్యక్షుడు చేరుతున్నట్లు వెల్లడించిన ఎంపీపీ

ఆర్మూర్ టౌన్, ఏప్రిల్ 15 (ప్రజా శంఖారావం):

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఇప్పటివరకు నందిపేట్, మాక్లూర్ మండలాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉంటే తాజాగా ఆర్మూర్ ఎంపీపీ పస్క నరసయ్యతో పాటు ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీభవన్లో మంత్రి సమక్షంలో చేరబోతున్నట్లు మంగళవారం ఒక పత్రిక ప్రకటన ద్వారా ఎంపీపీ తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలిపి, పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటామని ఆయన చెప్పారు. తనతో పాటు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆలుర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచులు, పార్టీ పలువురు సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.