G-L53TNVHN5Y బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. | Praja Shankaravam

బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్..

* ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డిల సమక్షంలో భారీ చేరికలు

* కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీపీ పస్క నరసయ్య

* బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచుల చేరికలు

ఆర్మూర్ టౌన్, ఏప్రిల్ 16 (ప్రజా శంఖారావం):

బిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల ఎంపిపి పస్క నర్సయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డిలు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నిజామాబాద్ డిసిసి మానాల మోహన్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగ గౌడ్, ఎంపిటిసిలు శ్రీనివాస్ గౌడ్, మహేష్ , ఎంసి గంగారెడ్డి, హన్మాండ్లు, భూమన్న, మాజి సర్పంచ్ లక్ష్మీ నారాయణ, మగ్గిడి దేవా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆలూర్ గ్రామ అధ్యక్షులు మండల రజనీకాంత్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాణాలు మల్లేష్, కొత్తూరు సునీల్ లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.