G-L53TNVHN5Y కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నాయకుల వలసలు | Praja Shankaravam

కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నాయకుల వలసలు

ఆర్మూర్ టౌన్, ఏప్రిల్ 17 (ప్రజా శంఖారావం):

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుల వలసలు కాంగ్రెస్ పార్టీలోకి మొదలయ్యాయి. బుధవారం మామిడిపల్లి బీజేపీ నాయకులు, మాజీ వార్డు సభ్యులు కుమ్మరి భూమేష్ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియంత పోకడను వ్యతిరేకిస్తూ, బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కౌన్సిలర్లు రవి గౌడ్, కొంతం మంజుల మురళి, ఆకుల రాము, కాశిరం, మామిడిపల్లి మాజీ సర్పంచ్ గడ్డం జ్యోతి మారుతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తవ్వన్న, శ్యామ్ గౌడ్, బబ్లు, చిట్టి రెడ్డి, భూపేందర్, పుట్టి మురళి, నటరాజ్, పివిఆర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.