G-L53TNVHN5Y ఐదుగురి పేకాట రాయుల్ల అరెస్ట్ | Praja Shankaravam

ఐదుగురి పేకాట రాయుల్ల అరెస్ట్

మెట్ పల్లి, ఏప్రిల్ 18 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని కేసీఆర్ తండాలో పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లపై దాడులు జరిపామని ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం. గూగులోతు గంగాదాస్ అనే వ్యక్తి మండలంలోని కెసిఆర్ తండాలో పేకాట స్థావరం ఏర్పాటు చేసి ఆడిస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీస్ లు దాడులు నిర్వహించి నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హాసకొత్తూరు గ్రామనికి చెందిన సంత లింగారెడ్డి, కమ్మరి పల్లికి చెందిన కర్రే నిలకంఠం లు కోరుట్లకు చెందిన జగన్నాథ లక్ష్మణ్, నడికుడకు చెందిన కరుపెళ్లి నరసారెడ్డి, తిమ్మాపూర్ కు చెందిన ఏలేటి గంగారెడ్డి లను అరెస్ట్ చేసి ఎనిమిది వేల రూపాయల నగదు, 5సెల్ ఫోన్లు 9 ద్విచక్రవాహనాలను స్వాధీనపరచుకున్నట్లు చెప్పారు. మరో 9 మంది పరారీలో ఉన్నారని మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.