G-L53TNVHN5Y నీళ్ల కుండిలో పడి బాలుడు మృతి | Praja Shankaravam

నీళ్ల కుండిలో పడి బాలుడు మృతి

మేడిపల్లి, ఏప్రిల్ 19 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో ప్రమాద వశాత్తు నీళ్ల కుండిలో పడి పరమేశ్వర్ (7 ) బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఏఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం. ఒరిస్సా రాష్ట్రం బేల గ్రామానికి చెందిన బైగని సాంబర్ గత నాలుగు నెలల క్రితం తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని మేడిపల్లిలోని పాలబోయిన రమేష్ ఇటుక బట్టిలో కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే ఇటుకబట్టిలోని మరికొందరి పిల్లలతో కలిసి వారు నివాసం ఉంటున్న నీళ్ల కుండిలో (వాటర్ హౌస్) వద్దకు స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని అన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని అన్నారు. బాలున్ని పరిశీలించిన వైద్యులు బాలుడు చనిపోయాడని నిర్ధారించగా మృతుడి తల్లి బైగాని సాoబార్ ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.