G-L53TNVHN5Y పిఎమ్ఆర్ గ్రాండ్ హోటల్ లో అధికారుల తనిఖీలు | Praja Shankaravam

పిఎమ్ఆర్ గ్రాండ్ హోటల్ లో అధికారుల తనిఖీలు

 

* హోటల్ స్టోర్ రూంలో పురుగులు పట్టిన సామాగ్రీ
* నాణ్యతలేని ఆహారం అందించడం పై అధికారుల ఆగ్రహం
* హోటల్ కిచెన్ సీజ్ చేసిన అధికారులు
* హోటల్లో లోతైన విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్

జగిత్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 19 (ప్రజా శంఖారావం):

జగిత్యాల పట్టణ కేంద్రంలోని రాజీవ్ గాంధీ బై పాస్ రోడ్డు లో ఉన్న పిఎమ్ఆర్ గ్రాండ్ హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్టోర్ రూంలో పురుగుల బియ్యం, నువ్వులు, పప్పులు సామాగ్రి వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించే హోటల్ గా యాజమాన్యం ప్రచారం నిర్వహించుకుంటు కష్టమర్లకు నాణ్యత లేని ఆహారం అoధిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. కాల పరిమితి ముగిసిన ఆహర పదార్థాలు వాడుతున్నట్లు కూడా తనిఖీల్లో బయట పడ్డాయి. తనిఖీ చేసి స్టోర్ రూమ్, కిచెన్ ను ఫుడ్ సేఫ్టీ అధికారిణి అనూష సీజ్ చేశారు. అతి పెద్ద హోటల్ గా పేరు గాంచిన పిఎమ్ఆర్ హోటల్లో కాల పరిమితి ముగిసిన ఆహార పదార్థాలు లభ్యం కావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపించిన హోటల్ ఫై మరింత లోతుగా దాడులు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.