G-L53TNVHN5Y ఎన్నికల కోడ్ మరిచిన అధికారులు | Praja Shankaravam

ఎన్నికల కోడ్ మరిచిన అధికారులు

* ఫ్లెక్సీ తొలగింపులో అధికారుల నిర్లక్ష్యం

* ఎన్నికల కోడ్ వచ్చి రోజులు గడుస్తున్న మేల్కొనని అధికారులు
* అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల విస్మయం..!

ఆర్మూర్ టౌన్, ఏప్రిల్ 20 (ప్రజా శంఖారావం):

పార్లమెంట్ ఎన్నికల కోడ్ కూసి రోజులు గడుస్తున్న అధికారుల మొద్దు నిద్రను వీడడం లేదు. అధికారుల నిర్లక్ష్యం తీరు కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని నడిబొడ్డున ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్నప్పటికి అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర నుండి మేల్కొని ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని పలువురు కోరుతున్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలను అతిక్రమించే సామాన్యులపై అధికారులు కొరడా గులిపిస్తారు. మరి కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.