G-L53TNVHN5Y పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్ | Praja Shankaravam

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్

 

* కాంప్లెక్స్ ఉపాధ్యాయుల జీతాల నిధులు గోల్మాల్
* విధుల్లో నిర్లక్ష్యం పై సస్పెన్షన్ వేటు

కరీంనగర్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 20 (ప్రజా శంఖారావం):

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను తీర్చిదిద్ది, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్న సందేశంతో విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన గురువులే కొందరు తప్పులు చేయడం పట్ల ఉపాధ్యాయ లోకం తలదించుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు పి.రాజభాను చంద్ర ప్రకాశ్ ఎల్ ఎం డి స్కూల్ కాంప్లెక్స్ లో ఉపాధ్యాయుల జీతాల రికవరీ పేరిట నిధులు గోల్ మాల్, సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయులకు జీతాలబిల్లు దాదాపు పది లక్షల వరకు ట్రెజరీ లో చెల్లించకుండా స్వాహా చేయడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఎల్ ఎం డి కాంప్లెక్స్ హెడ్మాస్టర్, తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన్ను సస్పెన్షన్ చేస్తూ శనివారం వరంగల్ ఆర్జేడీ కె.సత్యనారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.