G-L53TNVHN5Y పేకాట స్థావరాలపై దాడి 18 మంది అరెస్ట్ | Praja Shankaravam

పేకాట స్థావరాలపై దాడి 18 మంది అరెస్ట్

కోరుట్ల, ఏప్రిల్ 20 (ప్రజా శంఖారావం):

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కిషనరావు పల్లెలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. కోరుట్ల ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. కిషనరావుపల్లే గ్రామ శివారులో పేకాట ఆడుతున్నరని సమాచారం మేరకు దాడి చేయగా పేకాట ఆడుతూన్న 18 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 1లక్ష 51 వేల రూపాయల నగదు,18 సెల్ ఫోన్లు, 5 బైకులు స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్సై వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసిట్లు ఎస్సై తెలిపారు .

Leave A Reply

Your email address will not be published.