G-L53TNVHN5Y వక్ఫ్ బోర్డ్ రద్దు చేయాలి: ఎంపీ అరవింద్ | Praja Shankaravam

వక్ఫ్ బోర్డ్ రద్దు చేయాలి: ఎంపీ అరవింద్

జగిత్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 20 (ప్రజా శంఖారావం):

వర్క్ బోర్డ్ రద్దు చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. ఇస్లాం దేశాలు ఒకరిని మించి ఒకరు హిందూ దేవాలయాలు కడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో పర్సనల్ లా లు ఉండవని ఒకటే లా ఉంటుందని ఆయన అన్నారు. దేశంలో ఒకటే సివిల్ కోడ్ ఉండాలని అంబేద్కర్ ఆశయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజించి పాలించు అన్న సిద్ధాంతంతో దేశాన్ని విభజన చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతూ ఆర్టికల్ 370 ఎత్తెస్తామని చెప్పడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో సెక్యులర్ పదం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అలాగే మధురలో శ్రీకృష్ణుని జన్మస్థలంలో దర్గా ఎందుకు కట్టారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు బోవర్ శ్రావణి, స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.