G-L53TNVHN5Y విద్యుత్ షాక్ తో మహిళ మృతి | Praja Shankaravam

విద్యుత్ షాక్ తో మహిళ మృతి

మెట్ పల్లి, ఏప్రిల్ 20 (ప్రజా శంఖారావం):

ఈదురుగాలులు వీచి మహిళ ప్రాణాలు బలిగొన్న ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో చోటు చేసుకుంది. మృతిరాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మెట్ పల్లి పట్టణంలోని అయ్యప్ప ఆలయం వద్ద నివాసముంటున్న పల్లపు రజిత (30) ఇదురు గాలులు విస్తున్న సమయంలో ఇంటి వద్ద రేకుల షెడ్డుకు తాడుతో కట్టిన తాడుపై బట్టలు తీసే క్రమంలో విద్యుత్ స్తంభం ఫై నుండి ఇంట్లోకి వచ్చే విద్యుత్ వైర్ రేకులకు తగిలి షాక్ కు గురైంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.