G-L53TNVHN5Y వైద్యం వికటించి బాలుడి మృతి | Praja Shankaravam

వైద్యం వికటించి బాలుడి మృతి

 

* బాలుడికి ఆపరేషన్ చేయాలంటూ ఐరాన చేసిన వైద్యులు
* వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడని బంధువులు ఆరోపణ
* మరో ఠాగూర్ సినిమాను తలపించిన వైద్యుల నిర్వాకం
* ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం

కరీంనగర్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 21 (ప్రజా శంఖారావం):

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం వికటించి రామడుగు మండలానికి చెందిన చైత్రిక్ అనే ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాలుడు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజుల నుండి వెంటిలేషన్ పైనే బాలుని ఉంచి శనివారం ఆపరేషన్ చేస్తామంటూ హడావిడి చేస్తూ సినిమాను తలపించేలా బాలుడి బంధువులను తెగ ఐరానా చేస్తూ చివరకు ఆపరేషన్ చేశామంటూ ఆపరేషన్ కి బాలుడు సహకరించలేదంటూ నిర్లక్ష్యం సమాధానం చెప్పారని వైద్యులపై బంధువులు మండిపడ్డారు. ఆస్పత్రికి నడుచుకుంటూ వచ్చిన వాడు నేడు శవమయి ఇంటికి వెళ్తున్నాడని చెబుతూ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. వారి రోదనా అక్కడివారిని కలిచి వేసింది. ఆస్పత్రి ఎదుట బైఠాయించి తమ కొడుకుని తమకు తెచ్చియమంటూ సిబ్బందితో వాదనకు దిగారు. మేమేం చేయలేమంటూ చేతులెత్తేసి ఆస్పత్రి నుండి వారిని బయటకు గెంటేసిన హృదయవిదాకరణ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల తీరు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ డబ్బే సంపాదనగా కొంతమంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్యంపై నిర్లక్ష్యం చేసి మనుషుల ప్రాణాలతో చెలగొట్టాలాడుతున్న ఆసుపత్రులను సీజ్ చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు విచారణ చేసి బాలుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కొన్ని సంఘాల ప్రతినిధులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Leave A Reply

Your email address will not be published.