G-L53TNVHN5Y ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య | Praja Shankaravam

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా, ఏప్రిల్ 24 (ప్రజా శంఖారావం):

Inter student suicide … ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని దోరగారిపల్లేలో ఇంటర్ విద్యార్థిని తేజశ్విని ఉరి వేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. బుధవారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో ఫెయిలవడంతో ఈ ఘాతకానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వస్పత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.