G-L53TNVHN5Y బస్సు సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న భర్తలు | Praja Shankaravam

బస్సు సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న భర్తలు

 

మహబూబాబాద్ జిల్లా, ఏప్రిల్ 24 (ప్రజా శంఖారావం):

Fight with husbands for RTC seat …ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇప్పటి వరకు కొట్టుకున్న మహాలక్ష్మి లను చూసాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. భార్యల సీటు కోసం ఇప్పుడు భర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే తొర్రూరు నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు బయలుదేరిన బస్సులో ప్రయాణికులు ఇద్దరు సీటు కోసం కర్చీఫ్ వేసి సీట్లు అపుకున్నారు. అయితే ఒకరు ఆపుకొన్న సీటులో మరొకరు కూర్చోవడంతో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది. ఇది కాస్త గొడవకు దారి తీయడంతో గొడవ పడిన మహిళల భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది. ఆ గొడవతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగడంతో కండక్టర్ ఫిర్యాదుతో మేరకు పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు.

Leave A Reply

Your email address will not be published.