G-L53TNVHN5Y తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ | Praja Shankaravam

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

 

* 5 1/2 తులాల బంగారం, 15 తులాల వెండి
* 42 వేల నగదు అపహరణ
* ఆధారాలు సేకరిస్తున్న క్లూజ్ టీమ్

మెట్ పల్లి, ఏప్రిల్ 25 (ప్రజా శంఖారావం):

A grand theft in a locked house.. మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే బాధితురాలు పోచంపల్లి లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం బంధువుల ఇంటికి పండుగ నిమిత్తం ఊరికి వెళ్ళగా గురువారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని తెలిపింది. గ్రామ పెద్దలకు సమాచారం అందించగా వారు పోలీసులకు సమాచారం అందించారన్నారు. సుమారు ఐదున్నర తులాల బంగారం, పదిహేను తులాల వెండి, 42 వేల నగదు ఎత్తుకెళ్ళినట్లు బాధితులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు క్లూజ్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.