G-L53TNVHN5Y సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు | Praja Shankaravam

సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

*10వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ సబ్ రిజిస్టర్
* ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితులు
* వివరాలు వెల్లడించిన ఏసిబి డిఎస్పి రమణమూర్తి

కరీంనగర్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 27 (ప్రజా శంఖారావం):

Raids by ACB officials at Sub Registration Office.. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసిబి అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. బాధితుడు కొక్కుల రాజేశం తన భూమిని తన కొడుక్కి రిజిస్ట్రేషన్ చేసే విషయంలో సబ్ రిజిస్టర్ సురేష్ బాబు పదివేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేశారని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. బాధితుడు తన కొడుక్కి రేకుర్తి శివారులోని సర్వే నెంబర్ 131 లో ఉన్న భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించే విషయంలో అధికారులు డబ్బులు డిమాండ్ చేశారని పేర్కొన్నట్లు చెప్పారు. ఈ విషయంలో బాధితులు సబ్ రిజిస్ట్రేషన్ లో పనిచేస్తున్న కొత్తకొండ శ్రీధర్ కు డబ్బులు ఇచ్చే సమయంలో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు డిఎస్పీ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.