G-L53TNVHN5Y బిజెపిలోకి సీఎం రేవంత్ రెడ్డి | Praja Shankaravam

బిజెపిలోకి సీఎం రేవంత్ రెడ్డి

 

* జూన్ మొదటి వారంలో రేవంత్ రెడ్డి బిజెపిలోకి
* పిఎఫ్ఐకి అడ్డాగా జగిత్యాల జిల్లా
* 45 సంవత్సరాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు
* కాంగ్రెస్ పార్టీ హిందువులను నాశనం చేస్తుంది
* కార్నర్ మీటింగ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపి అరవింద్

జగిత్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 29 (ప్రజా శంఖారావం):

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ మొదటి వారంలో బిజెపిలో చేరుతారని ఎంపీ అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లాలో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఎంపీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 15వ సారి ఎలక్షన్లో నిలబడుతున్నాడని, 45 సంవత్సరాల నుంచి ఎలక్షన్లలో కొట్లాడుతూనే ఉన్నారని, రైతుల సమస్యలపై పోరాడలేదని మండిపడ్డారు. రైతులు 40 సంవత్సరాల నుండి పసుపు బోర్డు గురించి కొట్లాడుతుంటే తన హాయంలో పసుపు బోర్డు తీసుకొచ్చమన్నారు. జీవన్ రెడ్డి ఆడపిల్ల పెళ్లయితే తులం బంగారం ఇస్తా అంటూ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు అమలు పరచలేదని, కాంగ్రెస్ పార్టీ లాగా నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా జూన్ చివరి వారంలో బిజెపిలో చేరతాడని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడు బిఆర్ఎస్, బిజెపి ఒక్కటై కవితమ్మ జైల్లో పెట్టలేదని మాట్లాడినవారు, ఇప్పుడు కవితను జైల్లో పెట్టారు కదా మరి ఏమంటారని ప్రశ్నించారు. కానీ కవితను సిబిఐ మరియు ఈడి లు జైల్లో పెట్టారన్నారు. జగిత్యాల గడ్డ పిఎఫ్ఐకి అడ్డగా మారిందని సిఏఎ, ఎన్ఆర్సిలను జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ నుండి వచ్చిన హిందువులను ఇండియాలోకి రాని వద్దని ముస్లింలను రానియాలని అంటున్నాడని మండిపడ్డారు. హిందువులు ఒక పెళ్లి చేసుకుంటారు, కానీ ముస్లింలు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారని ఆయన అన్నారు. సిఏఎ, ఎన్ఆర్సి ల వల్ల ముస్లిం మహిళలకు చాలా లాభం అవుతుందని, ఎందుకంటే ముస్లింలు కూడా ఒకే పెళ్లి చేసుకోవచ్చు మూడు నాలుగు పెళ్లిల్లు చేసుకోరాదని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లకి ఎలక్షన్ అప్పుడు మాత్రమే హిందువులు గుర్తుకొస్తారని, ఎలక్షన్లు అయిపోతే ముస్లింలు గుర్తు వస్తారని మే 13 వరకే జీవన్ రెడ్డి హిందువుల పాట పాడుతాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు 500 బోనస్ ఇవ్వని వాళ్ళు తులం బంగారం ఇస్తారా అంటూ విరుచుకుపట్టారు. దేశం శాంతిభద్రతలతో ఉండాలంటే మోడీని మూడోసారి ప్రధానిగా చేయాలని, బిజెపికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.