G-L53TNVHN5Y లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హెడ్ కానిస్టేబుల్ | Praja Shankaravam

లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హెడ్ కానిస్టేబుల్

జగిత్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 29 (ప్రజా శంఖారావం):

జగిత్యాల సబ్ డివిజనల్ లో నాన్ బెయిలెబుల్ వారెంట్ డ్యూటీ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ సోమవారం ₹5 వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి అధికారులకు చిక్కాడు. ఏసిబి డిఎస్పీ రమణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల రూరల్ మండలం పెరకపల్లి గ్రామానికి చెందిన బాలే తిరుపతి అనే వ్యక్తి దుబాయిలో ఉండగా, గతంలో ఆయనపై ఉన్న ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో ఆతని బందువుల నుండి 5 వేలు ఫోన్ పే ద్వారా తీసుకున్నాడు. మిగతా 5వేల కోసం హెడ్ కానిస్టేబుల్ వేదించగా, బాధితుడు ఆయన బంధువు కట్కం గంగాధర్ కు విషయాన్ని వివరించాడు. వారు ఏసిబిని అధికారులను ఆశ్రయించగా వారి సూచన మేరకు సోమవారం ₹ 5వేలు ఇస్తుండగా ఏసిబి అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టులో ప్రవేశ పెడతామని డిఎస్పీ తెలిపారు. ఈ దాడిలో సిఐలు కృష్ణ కుమార్, తిరుపతి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.