G-L53TNVHN5Y చల్లని బీర్లు దొరకడం లేదని ఫిర్యాదు | Praja Shankaravam

చల్లని బీర్లు దొరకడం లేదని ఫిర్యాదు

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 30 (ప్రజా శంఖారావం):

మంచిర్యాల జిల్లాతో పాటు చుట్టుపక్కల వైన్స్ షాపులలో మందుబాబులకు చల్లని బీర్లు అందుబాటులో ఉండడం లేదని ఏకంగా తమకంటూ ఏర్పాటు చేసుకున్న తాగుబోతుల సంఘం అధ్యక్షులు కొత్రంగి తరుణ్ పేరిట జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్రానికి తమ తాగుబోతుల వల్లే అధిక ఆదాయం వస్తుందని, అలాంటి తమను విస్మరించడం, బాధ పెట్టడం సబబుగా లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒక కంపెనీకి సంబంధించిన బీర్లు ఏ వైన్స్ షాపులలో అందుబాటులో ఉండడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. వేసవికాలంలో ఎండ వేడి నుండి తట్టుకోవడానికి తమకు చల్లని బీర్లు అందుబాటులో ఉంచాలని ఆ శాఖ అధికారులను తాగుబోతుల సంఘం తరఫున జిల్లా అధ్యక్షుడు హోదాలో విన్నవిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. అవ్వకైన అధికారులు ఒకింత నవ్వుకున్నా ! ఇది నిజమే కదా ! అంటూ మాట్లాడుకోవడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Leave A Reply

Your email address will not be published.