G-L53TNVHN5Y అనుమానస్పద స్థితిలో మహిళ మృతి | Praja Shankaravam

అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 01 (ప్రజా శంఖారావం):

Woman dies in suspicious condition … జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లచ్చు నాయక్ తాండ గ్రామానికి చెందిన ఆకుల మౌనిక (లావణ్య) 25 బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పదునైన ఆయుధంతో మెడ కింది భాగంలో కోసి ఆమెను చంపి హతుడు పారిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మృతురాలి మామ ఆమెను హత్య చేసి పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. మృతురాలి భర్త విదేశాల్లో ఉన్నాడు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.