G-L53TNVHN5Y డబ్బుల సంచులు మోసిన కేసు లో రేవంత్ జైలుకు | Praja Shankaravam

డబ్బుల సంచులు మోసిన కేసు లో రేవంత్ జైలుకు

 

మెట్ పల్లి, మే 02 (ప్రజా శంఖారావం):

డబ్బుల బ్యాగులు మోసిన కేసులో జూలై 14న రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ అని, ఈ కేసులో సీఎం రేవంత్ జైలుకు ఎప్పుడు వెళ్తాడని కాంగ్రెస్ లో ఉన్న ప్రధాన నాయకులు ఆనందంతో ఎదురుచూస్తున్నారని అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వాఖ్యలు చేశారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత అబద్ధమో, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకాలు కూడా అంతే అబద్ధమని ఎంపీ అరవింద్ అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ఐలాపూర్, మల్లాపూర్ లలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల కాలంలో కెసిఆర్ ప్రజలకు కాస్తయినా సంక్షేమ పథకాలను అందించారని, మరిన్ని పథకాలను అందిస్తానని అబద్ధపు మాటలు చెప్పి కుండలను పెట్టి బిందెలను ఎత్తుకెళ్లినట్టు చేశాడు. కానీ రేవంత్ రెడ్డి ఆ కుండలను కూడా లేకుండా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం వెళ్ళినప్పుడు 6 గ్యారెంటీలు లేకపోయే సరికి ప్రజలు నిలదీస్తారన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గుడ్డు వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చారని కాంగ్రెస్ ని ప్రజలు ఎవరు నమ్మవద్దని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.